రైతు భరోసా గోవిందా?: సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైంది? | కోడ్ తర్వాతా రైతుల ఖాతాల్లోకి పైసలు పడతాయా?

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన Rythu Bharosa హామీపై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రూ.9,000 కోట్లు వేస్తామని స్వయంగా సీఎం చెప్పిన యాదికి ఉంది కదా. ఆ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా, ఎన్నికల కోడ్ కూడా ఎత్తేసినా ఇప్పటికీ పైసలు ఎక్కడ? ఈ ఆలస్యం వెనుక ప్రభుత్వ వ్యూహం ఏంటి? అసలు Rythu Bharosa గోవిందా అని రైతులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హామీల పండుగ: ఎన్నికల ముందు రాజకీయ నాయకుల తీరు

  • అరచేతిలో వైకుంఠం చూపించడం
  • నోటికొచ్చిన హామీలు ఇవ్వడం
  • గత ప్రభుత్వాల కంటే ఎక్కువ ఇస్తామని నమ్మబలకడం
  • అధికారంలోకి వచ్చాక మరిపించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం

రేవంత్ రెడ్డి హామీలు: Rythu Bharosa 15,000 ముచ్చట

అంశంగత ప్రభుత్వం (Rythu Bandhu)రేవంత్ రెడ్డి హామీ (Rythu Bharosa)
ఆర్థిక సహాయం₹10,000₹15,000

మున్సిపల్ ఎన్నికల హామీ: ఏం జరిగింది?

  • మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే Rythu Bharosa విడుదల
  • సుమారు ₹9,000 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లోకి
  • నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే

కోడ్ ఎత్తేశారు: Rythu Bharosaకు అడ్డంకులు ఏంటి?

  • మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి
  • మేయర్లు, చైర్‌పర్సన్ల ప్రక్రియ పూర్తైంది
  • రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తేశారు
  • Rythu Bharosaకు ఎలాంటి అడ్డంకులు లేవు

బోనస్ పైసల మాయ: డైవర్షన్ పాలిటిక్స్?

చర్యవివరాలు
Rythu Bharosa హామీఎన్నికల ప్రచారంలో
బోనస్ పైసలు విడుదల₹500 కోట్లు
రైతుల ఖాతాల్లోకిఈ వారం రోజుల్లో

రాబోయే ఎన్నికలు: ప్రభుత్వ వ్యూహం ఏంటి?

మరో వారం పది రోజుల్లో MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాబోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన ఊపులో ఉన్న కాంగ్రెస్, ఇదే అదునుగా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల ముందు Rythu Bharosa వేసి ఎన్నికలకు వెళ్ళాలని మొదట ప్రభుత్వం ఆలోచించినా, ఇప్పుడు బోనస్ డబ్బులు రిలీజ్ చేసి చేతులు దులుపుకుందామని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎన్నికల ముందు ఇలాంటి వ్యూహాలు మామూలే.

బీసీ రిజర్వేషన్ల “మాయ”: Rythu Bharosaకూ అదే ప్లాన్?

  • సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించడం
  • కేవలం 17% రిజర్వేషన్లు కేటాయించడం
  • మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అంశాన్ని మరుగున పడవేయడం
  • Rythu Bharosaకు కూడా అదే ప్లాన్ అనుసరించే అవకాశం ఉంది

మొత్తంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన Rythu Bharosa హామీ నెరవేరుతుందా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎన్నికల కోడ్ ఎత్తేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకొని, వెంటనే Rythu Bharosa నిధులను విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ రైతుల భవిష్యత్తుపై మనం నిరంతరం ఒక కన్ను వేసి ఉందాం.

Read More:

మహాలక్ష్మి స్మార్ట్ కార్డు: మహిళలకు నెలకు ₹2500, ఉచిత బస్సు ప్రయాణం – తప్పనిసరి స్మార్ట్ కార్డు!

TS Pension Hike 2026: పెన్షన్ ₹4,000 కు పెంపు ముహూర్తం ఫిక్స్. లబ్ధిదారులకు CM రేవంత్ రెడ్డి అదిరిపోయే తీపికబురు!

Rythu Bharosa Update: డిజిటల్ క్రాప్ సర్వే పూర్తైతేనే రైతు భరోసా నిధులు? | అన్నదాతలకు కీలక సమాచారం!

Author

  • Telangana Mahiti Author Pavan Cs

    నమస్తే! నేను Pavan, ఈ ప్లాట్‌ఫామ్ ఫౌండర్ మరియు మెయిన్ కంటెంట్ క్రియేటర్‌ని. గత 3 ఏళ్లుగా బ్లాగింగ్ రంగంలో ఉంటూ.. ఉద్యోగ సమాచారం (Jobs), ప్రభుత్వ పథకాలు (Govt Schemes), మరియు ఎడ్యుకేషన్ అప్‌డేట్స్‌ని మీకు అందించడమే నా స్పెషాలిటీ. ప్రభుత్వ పథకాలు అంటే ఏదో కష్టమైన సబ్జెక్ట్ లా కాకుండా, మన పల్లెటూరి జనాలకు కూడా ఒక్క ముక్కలో అర్థమయ్యేలా, మన ఇంటి మనిషిలా సరళమైన తెలుగులో వివరించడమే నా లక్ష్యం."

Leave a Comment